మంగళవారం 02 మార్చి 2021
Narayanpet - Feb 01, 2021 , 00:12:14

ఆరోగ్య తెలంగాణ సాధనే లక్ష్యం

ఆరోగ్య తెలంగాణ సాధనే లక్ష్యం

  • జెడ్పీ చైర్‌పర్సన్‌ వనజ  
  • పల్స్‌ పోలియో చుక్కల మందు పంపిణీని ప్రారంభించిన అధికారులు, ప్రజాప్రతినిధులు

ఊట్కూర్‌, జనవరి 31 : ఆరోగ్య తెలంగాణ సాధనే ప్రభుత్వ లక్ష్యమని జెడ్పీ చైర్‌పర్సన్‌ వనజ అన్నారు. జాతీయ పల్స్‌ పో లియో కార్యక్రమంలో భాగంగా మక్తల్‌ పట్టణంలోని బస్టాండ్‌ సెంటర్‌లో ఆదివారం పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి ఆమె మాట్లాడారు. అలాగే నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్స్‌ పోలియో బూత్‌లను స్థానిక ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. ఊట్కూ ర్‌ మండలం శ్రీరాంగనర్‌లో ఎంపీపీ లక్ష్మి, తిప్రాస్‌పల్లిలో జెడ్పీటీసీ అశోక్‌కుమార్‌గౌడ్‌, నర్వ మండలం రాయికోడ్‌లో ఎంపీపీ జయరాములు శెట్టి, పెద్దకడ్మూర్‌లో జెడ్పీటీసీ జ్యోతి కిరణ్‌ప్రకాశ్‌, కృష్ణ మండలం హిందూపూర్‌లో ఎంపీపీ పూర్ణిమపాటిల్‌ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఊట్కూర్‌లో ని పలు బూత్‌లను జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ జయచంద్రమోహన్‌ సందర్శించి సిబ్బందికి తగిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులను అంగవైకల్యం నుం చి కాపాడేందుకు ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించాలన్నారు. సిబ్బంది విధులపై నిర్లక్ష్యం వహించరాదని, కొవిడ్‌ నిబంధనలు పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యులు సిద్ధప్ప, దివ్య, నరేశ్‌చంద్ర, శ్రీమంతు, సర్పంచులు సుమంగళి, మాణిక్యమ్మ, ఎంపీహెచ్‌ఈవో హేమ్‌లాల్‌, ఎంపీటీసీలు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వా డీ టీచర్లు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

విజయవంతంగా పల్స్‌ పోలియో

నారాయణపేట, జనవరి 31 : పేట నియోజకవర్గంలో పల్స్‌ పోలియో కార్యక్రమం విజయవంతమైంది. జిల్లా కేంద్రంలోని ఆయా వా ర్డుల్లో కౌన్సిలర్లు, అదేవిధంగా మరికల్‌, ధన్వాడ, దామరగిద్ద మండలాల్లో ప్రజాప్రతినిధులు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ధన్వాడ మండలంలో సర్పంచ్‌ అమరేందర్‌రెడ్డి, మరికల్‌ మండలంలో జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ సురేఖరెడ్డి, దామరగిద్ద మండలం కాన్‌కుర్తిలో సర్పంచ్‌ మహేశ్వరి, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ భాస్కరకుమారి, ఎంపీపీ నర్సప్పలతో కలిసి చిన్నారులకు పోలియో చు క్కలు వేశారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశ కార్యకర్త లు పాల్గొన్నారు.


VIDEOS

logo