CSK vs LSG : పదిహేడో సీజన్లో ఓపెనింగ్ జోడీ కుదరని చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)కు ఆదిలోనే షాక్. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే సీఎస్కే తొలి వికెట్ కోల్పోయింది. మ్యాట్ హెన్రీ వేసిన ఆఖరి బంతికి అజింక్యా రహానే(1) ఔటయ్యాడు. బంతి ఎడ్జ్ తీసుకోవడంతో వికెట్ కీపర్ రాహుల్ చేతికి చిక్కాడు. దాంతో, 4 పరుగులకే తొలి వికెట్ పడింది.
ఆ తర్వాత వచ్చిన డారిల్ మిచెల్(8) దంచుతున్నాడు. మొహ్సిన్ ఖాన్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లతో ఊపు తెచ్చాడు. మరో ఎండ్లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 16 పరుగులతో ఆడుతున్నాడు. 3 ఓవర్లకు స్కోర్.. 25/1.