e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 17, 2021
Home జిల్లాలు కెనాల్‌ మరమ్మతు పనులు పూర్తి

కెనాల్‌ మరమ్మతు పనులు పూర్తి

దగ్గర ఉండి పనులు చేయించిన ఎమ్మెల్యే
సాగునీరు విడుదలకు మార్గం సుగమమం

మక్తల్‌ రూరల్‌, ఆగస్టు 2 : భీమా ఎత్తిపోతల పథకం ఫేజ్‌-1లో అంతర్భాగమైన సంగంబండ (చిట్టెం నర్సిరెడ్డి) బ్యాలెన్సింగ్‌ హైలెవల్‌ కెనాల్‌ పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. జూలైలో కురిసిన భారీ వర్షాలకు సంగంబండ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ హైలెవల్‌ కెనాల్‌కు ఐదు చోట్ల గండ్లుపడ్డాయి. దీంతో కెనాల్‌ కింద పంట పొలాలకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారింది. సకాలంలో వర్షాలు వచ్చి రి జర్వాయర్లకు పుష్కలంగా నీరు వచ్చినా పొలాలను సాగు చేసుకోలేని దుస్థితి. గండ్లు పూడ్చితేగాని పంట పొలాలకు నీరు వచ్చే పరిస్థితి లేకపోలేదు. ఎలాగైన రైతులు వానకాలంలో పంటలు సాగు చేసుకోవడానికి ఇబ్బందులు తలెత్తరాదనే ఉద్దేశంతో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. వారం రోజులుగా కాల్వలకు పడిన గండ్లను పూడ్చడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కృషి చేశారు. ఇంజినీరింగ్‌ అధికారులను వెంట తీసుకెళ్లి కాల్వల పునరుద్ధరణ పనులను పూర్తి చేయించారు. ఎమ్మెల్యే తీసుకున్న కృషి ఫలితంగా పంట పొలాలకు సాగునీరు అందించడానికి మార్గం సుగమమైంది. కాల్వలకు పడిన గండ్లు మరమ్మతులను సోమవారం శరవేగంగా పూర్తి చేశారు. ఆయా గండ్ల వద్ద సాగుతున్న పనులను ఎమ్మెల్యే పర్యవేక్షించా రు. గండ్లు పూడ్చివేత పనులను ము మ్మరం చేశారు. జేసీబీ మిషన్లు, హిటా చీ యంత్రాలతో గండ్లు పడిన చోట మొర్రం మట్టిని వేయించి రోడ్డు రోలర్ల యంత్రాలతో చదును చేశారు. దీంతో మక్తల్‌, నర్వ, అమరచింత, ఆత్మకూర్‌ మండలాల పరిధిలోని గ్రామాలకు సా గునీరు అందించడానికి ప్రాజెక్టు ఇంజినీరింగ్‌ చర్యలు చేపట్టారు. మంగళవా రం నుంచి కాల్వలకు సాగునీరు విడుదల చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. కెనా ల్‌ కింద దాదాపు 35 వేల ఎకరాలకు నీరు అందుతుందని అధికారులు తెలిపారు. కాగా ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకొని గండ్లను సకాలంలో మరమ్మతులు చే యించడం, పంట పొలాలకు సాగునీరు అం దించడంపై పలువురు రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఇంజినీర్లు సైతం వెంటనే రంగంలో కి దిగి కష్టపడి పని చేశారని, వారికి ప్రత్యేకంగా ఎమ్మెల్యే కృతజ్ఞలు తెలిపారు.
చిల్ట్రన్స్‌ పార్కు ఏర్పాటు
మక్తల్‌ టౌన్‌, ఆగస్టు 2 : మున్సిపాలిటీకి చిల్ట్రన్స్‌ పార్కు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మె ల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని మినీ ట్యాంక్‌ బండ్‌ వ ద్ద గల దండుమూల మలుపు దగ్గర దాదాపు రెండు ఎకరాల స్థలాన్ని మున్సిపాలిటీ చిల్ట్ర న్స్‌ పార్కు ఏర్పాటుకు ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.40 లక్షల నిర్మాణంతో చిల్ట్రన్స్‌ పార్కు ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. నిర్మాణానికి టెండర్‌ వేశామన్నారు. వారం రోజుల తర్వాత పనులు ప్రారంభమవుతాయన్నారు. అదేవిధంగా మక్తల్‌ పెద్ద చెరువును మినీ ట్యాంక్‌ బండ్‌గా మార్చామని ఆయన చెప్పారు.
పార్కు రెండు ఎకరాల స్థలంలో మున్సిపాలిటీని ఆకర్షిం చే విధంగా నిర్మాణం చేపడుతామన్నారు. ఇప్పటికై పురపాలక అధికారులు, చైర్‌పర్సన్‌, కౌన్సిల్‌ సభ్యులు సమన్వయ ంతో పని చేస్తే మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో తీసుకురావాలన్నారు. మున్సిపల్‌ ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని వారుల్లో పనులు చేపట్టాలన్నారు. ముఖ్యంగా 7, 9వ వార్డుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ ఏఈ నాగశివ, శేకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana