న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కేసుల ఫైలింగ్, లిస్టింగ్, ఇతర వివరాలను ఇకపై న్యాయవాదులకు వాట్సాప్లో పంపిస్తామని సీజేఐ చంద్రచూడ్ గురువారం వెల్లడించారు.
ఈ కొత్త సౌకర్యం ద్వారా అడ్వొకేట్లు, కక్షిదారులు కేసుల ఫైలింగ్, కోర్టు ఆర్డర్లు, తీర్పులు వాట్సాప్లో పొందుతారన్నారు. బార్ అసోసియేషన్ సభ్యులందరికీ కాజ్లిస్టులను వాట్సాప్ (8767687676) ద్వారా పంపిస్తామన్నారు.