యాదాద్రి: యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను ఈఎన్సీ రవీందర్రావు మంగళవారం పరిశీలించారు. మొదటగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యాదాద్రి కొండపైన ఉత్తర ప్రాంతంలో నిర్మిస్తున్న ప్రహరీ, ఎస్కలెటర్, క్యూ కాంఫ్లెక్స్ తుది మెరుగుల పనులను పరిశీలించారు.
అనంతరం కొండ కింద నిర్మితమవుతున్న రింగురోడ్డు సర్కిల్, గుండి చెరువు పునరుద్దరణతో పాటు పుష్కరిణి, కల్యాణకట్ట, అన్నదాన సత్రం, సత్యనారాయణ వ్రత మండప భవనాలను సందర్శించి పురోగతిపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో వైటీడీఏ ఎస్ఈ వసంతనాయక్, ఈఈ వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.