Gaaya Padda Simham Traiser | ‘గాయపడ్డ సింహం’ ట్రైజర్ రిలీజ్… తరుణ్ భాస్కర్ కొత్త అవతారంలో ..!
Gaaya Padda Simham Traiser | నూతన తరహా సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ‘పెళ్లి చూపులు’తో టాలీవుడ్‌కు న్యూ ఏజ్ కథనం ఎలా ఉండాలో చూపించిన ఆయన, ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో కల్ట్ ఫాలోయింగ్ సంపాదించారు. దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ వరుస చిత్రాలతో బిజీ అవుతున్న తరుణ్ భాస్కర్ ఇప్పుడు ‘గాయపడ్డ సింహం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
Gaaya Padda Simham Traiser | నూతన తరహా సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ‘పెళ్లి చూపులు’తో టాలీవుడ్‌కు న్యూ ఏజ్ కథనం ఎలా ఉండాలో చూపించిన ఆయన, ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో కల్ట్ ఫాలోయింగ్ సంపాదించారు. దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ వరుస చిత్రాలతో బిజీ అవుతున్న తరుణ్ భాస్కర్ ఇప్పుడు ‘గాయపడ్డ సింహం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా, ఫరియా అబ్దుల్లా, మానసా చౌదరి కథానాయికలుగా నటించారు. దర్శకుడు పవన్ సాధినేని సమర్పకుడిగా వ్యవహరించడం విశేషం. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ కలిపిన “ట్రైజర్” ను తాజాగా విడుదల చేశారు. విడుదలైన ట్రైజర్‌కు సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది. కామెడీ, వ్యంగ్యం, యాక్షన్ అంశాలను కలగలిపి సరదాగా రూపొందించినట్లు కనిపిస్తోంది.
కథాంశం విషయానికి వస్తే… అమెరికా వెళ్లాలని కలలు కనే ఓ యువకుడి జీవితంలో చోటుచేసుకునే సంఘటనల చుట్టూ సినిమా తిరుగుతుంది. వీసా రిజెక్ట్ కావడంతో అతడు ఎదుర్కొనే నిరాశ, ఫ్రస్ట్రేషన్, ఆ తర్వాత తీసుకునే నిర్ణయాలు కథకు ప్రధానాంశాలుగా ఉంటాయని ట్రైజర్ ద్వారా అర్థమవుతోంది. మధ్య మధ్యలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్లు, కేజీఎఫ్ స్పూఫ్ సన్నివేశాలు, అమెరికా వెళ్లకపోయినా హీరో ఇచ్చే బిల్డప్ డైలాగులు వినోదాన్ని పంచుతున్నాయి. ప్రత్యేకంగా ట్రైజర్‌లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను సూచించే విధంగా చూపించిన సన్నివేశాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అమెరికా వీసా నిబంధనల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న యువత ఆవేదనను ప్రతిబింబించే ప్రయత్నం చేసినట్లు అనిపిస్తోంది. “Don’t Laugh… It’s a Serious Matter” అనే క్యాప్షన్ ద్వారా చిత్ర బృందం కథలో ఉన్న అంతర్గత భావాన్ని స్పష్టంగా చెప్పింది.
వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సిద్ధమవుతున్నారు. దర్శకుడిగా ఇప్పటికే విజయాలు అందుకున్న తరుణ్ భాస్కర్‌కు నటుడిగా ఈ సినిమా ఎలాంటి బ్రేక్ ఇస్తుందో చూడాలి. వినోదంతో పాటు సమాజంలోని యువత సమస్యలను టచ్ చేస్తూ తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇది ఒక సింహం కథ 🦁🔥#TharunBhascker‘s #GaayapaddaSimham Promises a fresh, fun filled ride with a quirky, satirical take on the American Dream from an Indian viewpoint. The trailer hints at a KGF-style presentation with Pelli Choopulu-type humor, adding more fun to the Teaser.… pic.twitter.com/ZRxa6oNuXJ
— BA Raju’s Team (@baraju_SuperHit) February 9, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

