చండీఘడ్: పంజాబ్‌లోని తర్న్‌తరన్ జిల్లాలో ఫస్ట్ ఇయర్ లా స్టూడెంట్(Law College Student)ను తోటి విద్యార్థి కాల్చి చంపాడు. ఈ ఘటన ఇవాళ ఉదయం జరిగింది. ఆ తర్వాత తన వద్ద ఉన్న ఆయుధంతో ఆ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ప్రిన్స్‌రాజ్ అనే విద్యార్థి తన వద్ద ఉన్న గన్‌తో క్లాస్మేట్ సందీప్ కౌర్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపాడు. దీంతో సందీప్ అక్కడిక్కడే మృతిచెందాడు. ఆ తర్వాత అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు డిప్యూటీ ఎస్పీ జగ్బీర్ సింగ్ తెలిపారు.
రాజ్ ఎందుకు కౌర్‌ను చంపాడో ఇంకా స్పష్టంగా తెలియదు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నది. తర్న్‌తరన్ జిల్లాలోని ఉస్మా గ్రామంలో ఉన్న లా కాలేజీలో ఇద్దరూ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. క్లాస్‌రూమ్‌కు రాజ్ వచ్చిన సమయంలో ఇంకా క్లాస్ మొదలుకాలేదు. అయితే కౌర్ తలలోకి పిస్తోల్‌తో కాల్చాడతను. ఆ తర్వాత అదే వెపన్తో ఆత్మహత్య చేసుకున్నాడు. కౌర్ అక్కడిక్కడే ప్రాణాలు వదిలేశాడు.
కేసు దర్యాప్తు ప్రాథమిక దశలోఉన్నది. వన్‌సైడ్ లవ్ వల్ల ఈ అటాక్ ఘటన జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పిస్తోల్‌ను స్వాధీనం చేసుకున్నామని తర్న్‌తరన్ ఎస్ఎస్పీ సురిందర్ లంబా తెలిపారు. వెపన్ ఎక్కడ తీసుకున్నాడు, ఎలా దానితో కాలేజీలోకి వచ్చాడో దర్యాప్తు చేస్తున్నారు. ఘటన నేపథ్యంలో కాలేజీలో భారీ భద్రతను పెంచారు. సాక్ష్యాలను సేకరించేందుకు ఫోరెన్సిక్ బృందాలు చేరుకున్నాయి. క్రైమ్ స్పాట్ నుంచి పిస్తోల్‌ను రికవరీ చేశారు.