రామగిరి, ఫిబ్రవరి 09 : ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో బీఆర్ఎస్వీ సోమవారం ఆందోళన చేపట్టింది. పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ బ్రాంచ్‌ను బీఆర్ఎస్వీ నాయకులు ముట్టడించారు. ఎగ్జామినేషన్ బ్రాంచ్‌కు తాళం వేసి సుమారు మూడు గంటల పాటు నిరసన వ్యక్తం చేశారు. సిలబస్ పూర్తి కాకపోవడం, మున్సిపాటిలీ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేయాలని పలుమార్లు విన్నవించినా వర్సిటీ అధికారులు పట్టించుకోవడం లేదని ఎంజీయూ బీఆర్ఎస్వీ అధ్యక్షుడు వాడపల్లి నవీన్ అన్నారు. పరీక్షలను వెంటనే వాయిదా వేయాలని, లేకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.