Farmer Suicide | యాదాద్రి జిల్లాలో అప్పుల బాధతో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
Farmer Suicide | యాదాద్రి భువనగిరి జిల్లాలో అప్పుల బాధతో రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మకూరు(ఎం) మండలంలోని రాయిపల్లి గ్రామానికి చెందిన రైతు నాతి మల్లయ్య గౌడ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
Farmer Suicide | యాదాద్రి భువనగిరి జిల్లాలో అప్పుల బాధతో రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మకూరు(ఎం) మండలంలోని రాయిపల్లి గ్రామానికి చెందిన రైతు నాతి మల్లయ్య గౌడ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయిపల్లి గ్రామానికి చెందిన నాటి మల్లయ్య గౌడ్ తనకున్న నాలుగు ఎకరాలతో పాటు మరో రెండు ఎకరాల కౌలుకు తీసుకుని మొత్తం ఆరు ఎకరాల్లో వరి సాగు చేశాడు. అయితే పంట పెట్టుబడి కోసం దొరికిన చోటల్లా అప్పులు చేశాడు. తీరా పంట చేతికొచ్చే సమయంలో సాగునీరందక పంట పూర్తిగా ఎండిపోయింది. దీంతో మల్లయ్య తీవ్రంగా నష్టపోయాడు. పైగా కూతురు పెళ్లి కోసం తీసుకున్న అప్పులు కూడా భారమయ్యాయి. మొత్తం 20 లక్షల అప్పు ఎలా తీర్చాలా అని తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.
ఈ క్రమంలోనే అప్పులు తీర్చలేక తీవ్ర నిరాశలో మల్లయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ హనుమంతు తెలిపారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
Kohli – Renshaw | కోహ్లీకి ఊహించని షాకిచ్చిన ఆసీస్ బ్యాటర్.. చిరస్మరణీయ శతకంతో పదేళ్ల రికార్డు బ్రేక్..!
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

