ఓ వైపు బతుకమ్మ వేడుకలు, మరోవైపు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలతో జిల్లా అంతటా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తున్నది. ఆరో రోజైన సోమవారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో కలెక్టర్ పమేలాసత్పతి, ఈఓ గీత అలిగిన బతుకమ్మ ఆడారు. – యాదాద్రి, అక్టోబర్11
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో సోమవారం బతుకమ్మ ఆడారు. యాదాద్రి కొండపైన ఈఓ కార్యాలయం ప్రాంగణంలో యాదాద్రి కార్యనిర్వహణ విభాగం ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో కలెక్టర్ పమేలా సత్పతి, ఆలయ ఈఓ గీత, అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. తంగేడు, గునుగు, ఆనప, బీర వంటి తీరొక్క పూలతో బతుకమ్మలను అలంకరించారు. బతుకమ్మలను ప్రాంగణానికి చేర్చి ఆటపాటలతో సందడి చేశారు.