తుర్కపల్లి, జూన్ 10 : గత రెండేడ్లుగా స్నానల గదినే అవాసంగా చేసుకొని దుర్భర జీవితం కొనసాగిస్తున్న ఓ పేద కుటుంబానికి చెందిన ఒంటరి దళిత మహిళకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాక పోవడంతో బాత్రూమ్లోనే నివసించే దుస్తుతి నెలకొంది. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి (Turkapally ) మండలంలోని వీరారెడ్డిపల్లి నిరుపేద కుటుంబానికి చెందిన దలిత ఒంటరి మహిళ మందాల పోచమ్మ కూలి పనినే జీవనాధారం. గత రెండేడ్ల కిందట వర్షాలకు పెంకుటిల్లు కూలిపోయి నిలువ నీడ లేకుండా పోయింది. మళ్లీ ఇల్లు కట్టుకునే స్థోమత లేకపోవడంతో గత ప్రభుత్వంలో కేసీఆర్ మంజూరు చేసిన ఇంటికి సంబంధించిన బాత్రూంలోనే నివాసం ఉంటుంది.
కాంగ్రెస్ సర్కార్ గ్రామాల్లో నిర్వహించిన ఇందిరమ్మ ప్రజా పాలన సభలో సైతం ఇందిరమ్మ ఇల్లు కోసం దరాఖాస్తు చేసుకున్నప్పటికీ మంజూరు కాలేదు. ఇందిరమ్మ ఇల్లు వస్తదని ఇటీవలే మహిళ సంఘాల్లో రూ.లక్ష అప్పు తీసుకుని బేస్మెంట్ లేవల్ వరకు నిర్మాణం చేసింది. అయితే ఇల్లు మంజూరు కాకపోవడంతో సొంతి కళ నేరవేరలేదు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి నిల్వ నీడ కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.