సంస్థాన్ నారాయణపురం, జూన్ 09 : కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వారి కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి అన్నారు. సంస్థాన్ నారాయణపురం మండలంలోని గుజ్జ గ్రామానికి చెందిన ఎర్ర పరమేశ్ సోమవారం మృతి చెందాడు. విషయం తెలిసిన చలమల్ల కృష్ణారెడ్డి పరమేశ్ మృతదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎర్ర పరమేశ్ పిల్లల బాధ్యతను పూర్తిగా తానే తీసుకుంటానని, వారిని ఉన్నత చదువులు చదివిస్తానని, రూ.1 లక్ష ఆర్థిక సాయం అందిస్తానని తెలిపారు. తక్షణ సాయంగా రూ.10 వేలు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.