దంపతులను ఏమార్చి పుస్తెలతాడు అపహరణ
సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఓ వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి నాలుగు తులాల పుస్తెలతాడును అపహరించిన ఘటన భూదాన్ పోచంపల్లిలో సోమవారం జరిగింది.
భూదాన్ పోచంపల్లి, ఫిబ్రవరి 09 : సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఓ వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి నాలుగు తులాల పుస్తెలతాడును అపహరించిన ఘటన భూదాన్ పోచంపల్లిలో సోమవారం జరిగింది. బాధితుల వివరాలు ప్రకారం.. పట్టణ కేంద్రంలోని గాంధీనగర్‌కు చెందిన వంగూరి ప్రణీత, రాజు దంపతులు. బైక్ పై వచ్చిన ఓ వ్యక్తి డాక్టర్ అని చెప్పి 40 రోజులు మందు వాడితే సంతాన కలుగుతుందని నమ్మబలికాడు. ఇందుకు గాను రూ.12 వేలు ఖర్చు అవుతుందని తెలిపాడు. మందు చేయాలంటే కొన్ని వస్తువులు అవసరమని చిట్టి వ్రాసి ఇచ్చి బాదంతో పాటు వస్తువులు తీసుకురమ్మని రాజును పంపించాడు.
మందు పని చేయాలంటే మెడలో బంగారు వస్తువులు ఉండకూడదని చెప్పడంతో నమ్మి పుస్తెలతాడును బెడ్ పైన ఉంచారు. బెడ్ రూమ్ లోకి తీసుకెళ్లి శరీరంపై లిక్విడ్ రాయడం అనంతరం బాధితురాలని స్నానం చేయడానికి పంపించి బంగారంతో పరారయ్యాడు. స్నానం చేసి వచ్చిన తర్వాత నగలు కనిపించకపోవడంతో బాధితురాలు లబోదిబోమంటూ విలిపించసాగింది. బాధితురాలు వెంటనే డయల్ 100 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయగా స్థానిక పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

