రామన్నపేట, నవంబర్ 07 : దేశ సమైక్యతకు మతాలు, కులాలకు అతీతంగా అందరూ ఐక్యంగా కృషి చేయాలని రామన్నపేట తాసీల్దార్ లాల్ బహదూర్ అన్నారు. వందేమాతర గేయానికి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా శుక్రవారం మండల కేంద్రంలోని సుభాష్ సెంటర్లో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో సామూహికంగా వందేమాతర గేయంను అలపించారు. ఈ సందర్భంగా తాసీల్దార్ మాట్లాడుతూ స్వాతంత్య్ర సమర పోరాటంలో వందేమాతర గేయం అందరిని ఏకతాటిపైకి తీసుకురావడంతో పాటు స్ఫూర్తిని రగిలించి ఉద్యమానికి ఊపిరి పోసిందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వర్లు, వైద్యులు వీరన్న, మాధవచారి, దేవ్‌రాజ్, ప్రిన్సిపాల్ జగదీశ్, ఎస్ఐ నాగరాజు, వివిధ పార్టీల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.