మోటకొండూరు, అక్టోబర్ 08 : స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడే సిపిఎం పార్టీని ప్రజలు ఆదరించాలని ఆ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మాటూరి బాలరాజు గౌడ్ కోరారు. బుధవారం మోటకొండూరు మండల కేంద్రంలో నిర్వహించిన సిపిఎం మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు, కార్మికులు, మహిళల సమస్యల పరిష్కారానికి సిపిఎం నిరంతరం కృషి చేస్తోందన్నారు. పలు గ్రామాల్లో ప్రజా సమస్యల పరిష్కారంలో సిపిఎం కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు బాలగోని జయరాములు, మండల కార్యదర్శి కొల్లూరు అంజనేయులు, నాయకులు వడ్డేబోయిన మహేందర్, రోమన్, చెరుకు అనిల్, నాగరాజు, సాయిలు పాల్గొన్నారు.