యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున భారీ కంటైనర్ను రెండు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు వెనుక నుంచి ఢీకొట్టాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయారు. దీంతో డ్రైవర్ను బయటకు తీయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కాగా, చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రెండు గంటల పాటు శ్రమించి వాహనాలను ట్రాఫిక్ పోలీసులు క్లియర్ చేశారు.