భువనగిరి కలెక్టరేట్: జిల్లా వ్యాప్తంగా నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి తగు చర్యలు చేపట్టేందుకు 1950 టోల్‌ఫ్రీ నంబర్‌తోపాటు కలెక్టరేట్లో కంట్రోల్ రూం నంబర్ : 08685 23 4020 ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పమేలాసత్పతి సోమవారం తెలిపారు.
వర్షాలు, వరదలతో రోడ్లు దెబ్బతినడం, కాలు వలకు గండ్లు పడటం, పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించి, సత్వర చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించారు.కంట్రోల్‌రూంకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని ఆమె కోరారు. రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్, మున్సిపల్ శాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తంగా ఉండి పరిస్థితిని పర్యవేక్షిం చి, చక్కదిద్దాలని కలెక్టర్ కోరారు. భారీ వర్షాలు, వరదల కారణంగా అధికారులందరూ హెడ్‌క్వార్టర్‌లో ఉండాలని ఆదేశించారు.