ఆలేరు టౌన్, జూలై 14 : ఆలేరు పట్టణ కేంద్రంలోని ఆదర్శనగర్ కాలనీలో తాళం వేసిన పలు ఇళ్లలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి 11:30 ప్రాంతంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు పర్వతం చిన్న, వానరాశి వెంకట్ ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. 15 తులాల వెండి, 3.5 గ్రాముల బంగారు నగలు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. ఇద్దరు యువకులు కాలినడకన వచ్చి రెండు ఇండ్లలో దొంగతనానికి పాల్పడినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయింది. క్లూస్ టీమ్ దొంగతనాలు జరిగిన ఇళ్లలో వేలిముద్రలు సేకరించినట్లు సీఐ కొండలరావు తెలిపారు. బాధితులకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.