భూదాన్ పోచంపల్లి, జూన్ 20 : పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. శ్రుకవారం మున్సిపాలిటీలో హెచ్ఎండీఏ ద్వారా రూ.7.90 కోట్లు అలాగే మండలంలో పలు గ్రామాలకు రూ.9.10 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాగునీటి వనరుల కోసం పిల్లాయిపల్లి, బునాదిగానికాల్వ, ధర్మారెడ్డిపల్లి కాల్వలకు ర్రాష్ట ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. మండల పరిధిలో కాల్వల మరమ్మతు పనులు ప్రాంరభమైనట్లు వెల్లడించారు. మూసిలోకి మురికి నీరు రాకుండా 25 ఎస్టీపీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం త్రిఫ్ట్ పథకం కింద లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.
మందుల కుల సంఘానికి కమిటీ హాల్, పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని పలువురు డిమాండ్ చేయగా, ప్రభుత్వ స్థలం ఉంటే తప్పనిసరిగా మందుల కులస్తులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా చేనేత జౌళి శాఖ ఏడీ శ్రీనివాస్‌రావు, మున్సిపల్ కమిషనర్ అంజన్‌రెడ్డి, హెచ్ఎండీఏ రాజ్‌కుమార్, ఏఈ ఎంకన్న, పంచాయతీరాజ్ డీఈ దాసయ్య, ఏఈ దామోదర్, డీసీసీ ఉపాధ్యక్షుడు కళ్లెం రాఘవరెడ్డి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు పాక మల్లేశ్‌యాదవ్, పట్టణాధ్యక్షుడు భారత లవకుమార్, జిల్లా నాయకులు తడక వెంకటేశ్, సామ మధుసూదన్‌రెడ్డి, మర్రి నరసింహారెడ్డి, పోచంపల్లి బ్యాంక్ చైర్మన్ తడక రమేశ్, నాయకులు అనిరెడ్డి జగన్‌రెడ్డి, కొట్టం కరుణాకర్‌రెడ్డి, అంబరీష్‌రెడ్డి, కాసుల అంజయ్య, ఫకీరు నర్సిరెడ్డి, గోరంటి శ్రీనివాస్‌రెడ్డి, బండారు ప్రకాశ్‌రెడ్డి, భోగ భానుమతి, మోటె రజిత, తోట శ్రీనివాస్, గునిగంటి రమేశ్ పాల్గొన్నారు.
Bhoodan Pochampally : పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి