రాజాపేట, అక్టోబర్ 18 : బీసీలకు స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు సాధనే లక్ష్యంగా బీసీ సంఘాల పిలుపు మేరకు శనివారం రాజాపేట మండల కేంద్రంలో నిర్వహించిన బంద్ లో బీసీ సంఘంతో పాటు బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, ఎమ్మార్పీఎస్, వివిధ కుల సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూకంటి ప్రవీణ్ కుమార్, నెమిల మహేందర్ గౌడ్, మేక రమేష్, చిగుళ్ల లింగం, ఇంజ మహేశ్ మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. నేడు చేపట్టిన బీసీ బంద్ ఆరంభం మాత్రమేనన్నారు. రాజ్యాంగ సవరణ ద్వారా బీసీ రిజర్వేషన్లు సాధించే వరకు బీసీ సమాజం సంఘటితం కావాలని పిలుపునిచ్చారు.
అనంతరం మండలంలోని ప్రభుత్వ పాఠశాలలను, వర్తక వ్యాపార, వాణిజ్య సంస్థలను బంధు చేయాలని బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నేతలు నెమిలె కేదారి గౌడ్, మోత్కుపల్లి ప్రవీణ్, దాచేపల్లి రాజు, వస్పరి సుధాకర్, దాచేపల్లి శ్రీను, రాంగల్ల శ్రీను, మూల పోచయ్య, చిమ్మి సత్యనారాయణ, ఉచింతల నరేశ్, కొక్కొండ సిద్దులు, గవ్వల సిద్దేశ్వర్, సీహెచ్ లక్ష్మణ్, రాజు, కాకల్ల నవీన్, ఇరేని శ్రీధర్, అరేనీ నవీన్, సురేష్ గౌడ్ పాల్గొన్నారు.