ఆలేరు టౌన్, మే 31 : జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాలని మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక పాల శీతలీకరణ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నో త్యాగాలు, పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, సాధించుకున్న తెలంగాణలో అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రతి గ్రామంలో, మండల, పట్టణ కేంద్రంలో జాతీయ జెండాను ఎగురవేయాలన్నారు. అమరవీరుల చిత్ర పటాలకు పూలమాలలు వేస్తూ ఘనంగా నివాళులర్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
మాజీ సీఎం కేసీఆర్ సుదీర్ఘ పోరాటంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆంధ్ర పాలకులతో నష్టపోయిన తెలంగాణకు గత పది సంవత్సరాల కాలంలో కాలేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా సాగు, తాగు నీరు పితామహుడు కేసీఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యాదగిరిగుట్ట మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ వస్పరి శంకరయ్య, ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీద రవీందర్ గౌడ్, మండలాధ్యక్షుడు గంగుల శ్రీనివాస్, పట్టణాధ్యక్షుడు పుట్ట మల్లేశ్‌గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గ్యాదపాక నాగరాజు, గుట్ట పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మిడి రాంరెడ్డి, కొలుపుల హరినాథ్, కోటగిరి పాండరి, ఆరుట్ల లక్ష్మీ ప్రసాద్ రెడ్డి, కొరుకొప్పుల కిష్టయ్య, గవ్వల నర్సింహులు, రచ్చ రామ్ నరసయ్య, జూకంటి ఉప్పలయ్య, దయ్యాల సంపత్, ఎండీ ఫయాజ్, ఐలా కృష్ణ, సిరిగిరి విద్యాసాగర్, యాదయ్య పాల్గొన్నారు.