బీబీనగర్, మే 31: బీబీనగర్ మండలంలోని అన్ని రెవెన్యూ గ్రామాలలో జూన్ 3 నుంచి 19వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు (Revenue Sadassulu) నిర్వహించనున్నట్టు తహసీల్దార్ పి.శ్యామ్‌సుందర్‌రెడ్డి తెలిపారు. భూ సమస్యల శాస్వత పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన భూ భారతి చట్టం అమలులో భాగంగా గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామన్నారు. గ్రామాల ప్రజలు ఏవైనా భూ సమస్యలు ఉన్నట్లయితే రెవెన్యూ అధికారులకు అర్జీలను అందించి సమస్యను పరిష్కరించుకోవాలని, ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
షెడ్యూల్ ఇలా..
జూన్ 3- మహాదేవ్‌పూర్, బాగ్దాయర.
జూన్ 4- అన్నంపట్ల, రహీంఖాన్‌గూడెం, లక్ష్మీదేవిగూడెం.
జూన్ 5- జైనపల్లి, రాఘవాపూర్.
జూన్ 9- జమీలాపేట్, రాయరావుపేట్.
జూన్ 10- నెమరగోముల, మీది తండా, జియాపల్లి, జియాపల్లి తండా.
జూన్ 11- కొండమడుగు, గూడూరు.
జూన్ 12- మగ్దుంపల్లి, గొల్లగూడెం, మాదారం.
జూన్ 13- పడమటిసోమారం, మక్తానంతారం.
జూన్ 16- వెంకిర్యాల, పల్లెగూడెం, బ్రాహ్మణపల్లి, యెరబెట్టెతండా.
జూన్ 17-గురాలదండి, నీల తండా, పెద్దపలుగు తండా, రావిపహాడ్, రావిపహాడ్ తండా.
జూన్ 18- బీబీనగర్, జంపల్లి.
జూన్ 19- చిన్నరావులపల్లి, భట్టుగూడెం, రుద్రవెళ్ళి