రామన్నపేట, నవంబర్ 04 : ఈ నెల 15న నిర్వహించే ప్రత్యేక లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని రామన్నపేట ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఎస్.శిరీష రామన్నపేట సర్కిల్ పరిధిలోని పోలీసు అధికారులకు సూచించారు. మంగళవారం లోక్ అదాలత్ విజయవంతానికై సమన్వయ సమావేశం నిరహించారు. ఈ సమావేశంలో జడ్జీ మాట్లాడుతూ.. పెండింగ్ కేసులు వేగవంతంగా పరిష్కారం అయ్యేలా అన్ని విభాగాల అధికారులు, న్యాయవాదులు, సంబంధిత సిబ్బంది సమన్వయంతో పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్.వెంకటేశ్వర్లు, రామన్నపేట, వలిగొండ, ఎస్ఐ లు డి.నాగరాజు, యుగేందర్ గౌడ్, నాగరాజు, తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ మేనేజర్, పోలీస్ సిబ్బంది, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.