TVVP : విధులకు గైర్హాజరైన ముగ్గురు వైద్యులకు షోకాజ్ నోటీసులు
విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP) కమిషనర్ డాక్టర్ జె.అజయ్ కుమార్ హెచ్చరించారు. గురువారం రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
– రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేసిన టీవీవీపీ కమిషనర్ అజయ్కుమార్
రామన్నపేట, ఫిబ్రవరి 05 : విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP) కమిషనర్ డాక్టర్ జె.అజయ్ కుమార్ హెచ్చరించారు. గురువారం రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపి విభాగం, వార్డుల్లో తిరిగి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. హాజరు రిజిస్టర్లను పరిశీలించి అనుమతులు లేకుండా గైర్హాజరైన ముగ్గురు డాక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వైద్యులతో సమావేశమై ఆస్పత్రికి వచ్చే రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. రోగులకు అందిస్తున్న మందులపై ఆరా తీశారు. మందుల నిల్వలను పరిశీలించారు.
అత్యవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలన్నారు. అనంతరం స్థానిక నాయకులు ఆయనను కలిసి ఆస్పత్రి భవనం శిథిల దశకు చేరుకుందని, నూతన భవనంను ఏర్పాటు చేయాలని, ఆస్పత్రి స్థాయిని వంద పడకలకు పెంచాలని కోరారు. వంద పడకల ఆస్పత్రి భవన నిర్మాణం పరిశీలనలో ఉందని ఈ సందర్భంగా ఆయన వారికి తెలిపారు. ఆయన వెంట డీసీహెచ్ఎస్ చిన్నా నాయక్, వైద్యులు స్వాతి బాయి, నవీన్ సింగ్, మాధవచారి, దేవేందర్, సుమంగళి, హెడ్ నర్సులు సువర్ణ, సోలి, జ్యోతి, నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.

TVVP : విధులకు గైర్హాజరైన ముగ్గురు వైద్యులకు షోకాజ్ నోటీసులు
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

