యాదగిరిగుట్ట, ఏప్రిల్ 19 : ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఅర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభను విజయవంతం చేయాలని ఆ పార్టీ యాదగిరిగుట్ట పట్టణ సెక్రటరి జనరల్ పాపట్ల నరహరి పిలుపునిచ్చారు. యాదగిరిగుట్ట పట్టణం నుంచి వెయ్యి మందికి పైగా తరలిరావాలన్నారు. శనివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో గోడ పత్రికలను ఆవిష్కరించి మాట్లాడారు. కేసీఆర్ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసియాస్వామివారి ఆలయాన్ని దేశంలోనే గర్వపడే విధంగా అద్భుతంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. రాబోయే కాలంలో మరోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
యాదగిరిగుట్టను ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన కేసీఆర్కు బాసటగా నిలువాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ నాయకులు సయ్యద్బాబా, ఆరే శ్రీదర్ గౌడ్, అంకం నర్సింహ్మా, దేవపూజ అశోక్, గడ్డం చంద్రం, చిత్తర్ల బాలయ్య, గుండల్లి వెంకటేశ్ గౌడ్, షేక్ దావూద్, పేరబోయిన సత్యనారాయణ, కాటేకార్ పవన్, బండి వాసు, బాబా, గ్యాదపాక క్రాంతి, కంసాని స్వామి, భక్త కన్నప్ప, ఎస్కే నజీర్, గడ్డంమీది రాజాలు, బుడిగే సత్తయ్య, బుచ్చాల ఎల్లస్వామి. శ్రీనివాస్ పాల్గొన్నారు.