రాజపేట ఏప్రిల్ 17 : ఈనెల 27వ తేదీన వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ నేపథ్యంలో ఈనెల 18న రాజాపేటలోని చెలిమెడి ఫంక్షన్ హాల్ లో బీఆర్ఎస్ మండల పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ మండలాధ్యక్షుడు సట్టు తిరుమలేష్ తెలిపారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
సమావేశానికి మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి, మాజీ డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి హాజరుకానున్నారని తెలిపారు. మండల పార్టీ కుటుంబ సభ్యులందరూ పెద్ద ఎత్తున సమావేశానికి హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ సెక్రటరీ సంధిల భాస్కర్ గౌడ్, అంకతి సుదర్శన్, బెడద వీరేశం, ఎర్ర గోకుల జశ్వంత్, కర్ల కర్ణాకర్ రెడ్డి, గంధ మల్ల సురేష్, అంకతి నరసయ్య పాల్గొన్నారు.