భూదాన్ పోచంపల్లి, జూన్ 10 : భద్రత నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చునని తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిష్త్ అన్నారు. బుధవారం భూదాన్ పోచంపల్లి మండలం దేశ్ముఖి గ్రామంలో రోడ్డు భద్రత అవగాహన గ్రామ సభ నిర్వహించారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. యువతకు హెల్మెట్లను పంపిణీ చేశారు. రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సామూహికంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ట్రాఫిక్ సిగ్నల్ పాటించడం వేగ పరిమితులకు లోబడి డ్రైవింగ్ చేయడం హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించడం, మధ్యo సేవించి వాహనం నడపరాదన్నారు. రహదారుల భద్రత అనేది ఒకరి బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడు బాధ్యత మాత్రం అన్నారు. కుటుంబ సభ్యులు తమకోసం వేయికళ్లతో ఇంటి దగ్గర ఎదురు చూస్తున్నారని విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
అధిక వేగంతో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాన నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ తప్పని సరిగా ధరించాలని ఉంచారు. ఇంటికి కిటికీలకు ఎలా గ్రీక్స్ పెడుతున్నారో అదేవిధంగా తమ భద్రత కోసం హెల్మెట్ వాడాలని సూచించారు. దేశంలో సంవత్సరానికి 7, లక్షల మంది, తెలంగాణ రాష్ట్రంలో 7000 మంది, ప్రమాదాలు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికి తాళం ఫోన్ పౌచ్ , తలకు హెల్మెట్ కంపల్సరిగా పెట్టుకునే విధంగా చూడాలని అన్నారు. మందు తాగి వాహనదారుడు వాహనం నడపకూడదని, డ్రైవ్ లో అధిక మొత్తంలో కేసు నమోదు అవుతున్నాయని పేర్కొన్నారు.

రోడ్డు భద్రత నియమాలు పాటించాలి : అభిలాషా బిష్త్
భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా గుర్తించి ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. ప్రమాదాలు జరిగిన తర్వాత బాధపడటం కంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమన్నారు. యువత రోడ్డు భద్రత విషయంలో ఆదర్శంగా నిలచి సమాజానికి మంచి సందేశాన్ని ఇవ్వాలని కోరారు. ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం, రేషన్ కార్డులు ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దక్కిందని అన్నారు. భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పురం చెరువు కట్ట వద్ద రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రమాదాలు నివారించేందుకు భద్రతా చర్యలు చేపట్టేందుకు శాంక్షన్ చేసిన ఇంతవరకు చర్యలు చేపట్టలేదని, వాటి విషయమై సంబంధిత అధికారులతో తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఆకాంక్ష యాదవ్, చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్ రెడ్డి, మండల తాసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీఓ విజయ, ఎంపీఓ శశికళ, గ్రామ సర్పంచ్ దుర్గం జంగయ్య యాదవ్, ఉప సర్పంచ్ నూకల అశోక్, మండల వైద్యాధికారిని డాక్టర్ శ్రీవాణి, చౌటుప్పల్ రూరల్ సీఐ రాములు, స్థానిక ఎస్ఐ కంచర్ల భాస్కర్ రెడ్డి, ఎంపీఓ శశికళ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఉప్పునూతల వెంకటేష్ యాదవ్, నాయకులు కళ్లెం రాఘవరెడ్డి, పాక మల్లేష్ యాదవ్, సామ మోహన్ రెడ్డి, సూర్వి వెంకటేష్, ఏఓ శైలజ, ఏపీఎం తవుర్య నాయక్, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.