నాగర్ కర్నూల్ : రాజ్యాంగ హక్కులను ( Constitutional rights ) కాపాడుకుంటే రాజ్యాంగం మనల్ని కాపాడుతుందని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ( Marri Janardhan Reddy ) అన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూల్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు.
దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను అర్పించిన మహానుభావులు ఆశలు, ఆశయాలకు అనుగుణంగా భారత దేశ అభివృద్ధి పదంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దేశంలో ప్రజలందరికీ సమాన హక్కులు, అవకాశాలు ఉండాలని అసమానతలు లేని సమాజం నిర్మాణం కావాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అందించారని
పేర్కొన్నారు. పటిష్టమైన రాజ్యాంగం ఉన్నందువల్లనే భారత దేశం సమైక్యంగా, సమగ్రంగా భిన్నత్వంలో ఏకత్వంగా పురోగమిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.