Tamil CM : టీవీకే ఎమ్మెల్యే అభ్యర్థి (TVK MLA candidate) పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తమిళనాడు (Tamil Nadu) మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు (DMK Chief) ఎంకే స్టాలిన్ (MK Stalin) పై తమిళనాడు సీఎం (Tamil CM) జోసెఫ్ విజయ్ (Joseph Vijay) మరోసారి ఆగ్రహం వ్యక్తంచేశారు. త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న ధారాపురం (Dharapuram) నియోజకవర్గ ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తమ పార్టీ అభ్యర్థి సత్యభామ (Satyabhama) కు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా.. సత్యభామపై స్టాలిన్ చేసిన కామెంట్ల గురించి సీఎం విజయ్ ప్రస్తావించారు. ఒక మహిళను కించపర్చేలా స్టాలిన్ మాట్లాడారని విమర్శించారు. డీఎంకే, దాని మిత్రపక్ష పార్టీలకు ఓటు వేయడమంటే మహిళలను అవమానించే వారికి మద్దతు ఇవ్వడమేనని అన్నారు. ఈ విషయం తాను ముందే చెప్పానని తెలిపారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే తాను ఆ మాట అనలేదని, మొన్న ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకోవాలని అన్నారు. మా సోదరి సత్యభామ గురించి స్టాలిన్ నీచమైన మాటలు మాట్లాడారని విమర్శించారు.
ఆయనే కాదు ఆయన పార్టీకి చెందిన నేతలందరు కూడా ఆయన లాగే బహిరంగ వేదికలపై మహిళల గురించి అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తన గురించి ఏం మాట్లాడిన భర్తిస్తానని, కానీ మహిళల గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోనని హెచ్చరించారు.