Cooking Oil | ఏ వంట నూనె వాడారో చెప్పాల్సిందే.. హోటళ్లు, రెస్టారెంట్లకు యూపీలో కొత్త రూల్స్
Cooking Oil : తాజాగా, ఉత్తర ప్రదేశ్ ఒక ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. రెస్టారెంట్లు, హోటళ్లలో వాడే వంట నూనె గురించి వినియోగదారులకు తప్పనిసరిగా వెల్లడించాల్సిందే.
Cooking Oil : గతంతో పోలిస్తే ఫుడ్ సేఫ్టీపై మన ప్రభుత్వాలు ఇప్పుడు ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. కల్తీ ఆహారం, ఆరోగ్యకరమైన ఆహారం విషయంలో కేంద్ర ప్రభుత్వంతోపాటు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా, ఉత్తర ప్రదేశ్ ఒక ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. రెస్టారెంట్లు, హోటళ్లలో వాడే వంట నూనె గురించి వినియోగదారులకు తప్పనిసరిగా వెల్లడించాల్సిందే. ఈ మేరకు ఉత్తర ప్రదేశ్ ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఎస్డీఏ) దీనిపై ఆదేశాలు జారీ చేసింది.
అలాగే, ఆహార భద్రత విషయంలో ఇంకొన్ని సేఫ్టీ రూల్స్‌ను కూడా ఎఫ్ఎస్డీఏ సూచించింది. దీని ప్రకారం.. ఇకపై ఉత్తర ప్రదేశ్‌లోని అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, ఇతర ఆహార తయారీ సంస్థలు ఏవైనా తాము ఏ నూనెతో ఆహారం తయారు చేస్తున్నాయో తప్పనిసరిగా వెల్లడించాల్సిందే. దీనివల్ల వినియోగదారులకు తాము తినే ఆహారంపై ఒక స్పష్టత వస్తుంది. మెనూలోని ప్రతి ఐటంకు సంబంధించి నూనె వివరాల్ని తెలపాలి. అలాగే, కిచెన్ హైజీన్ గురించి కూడా కస్టమర్లకు తెలియజేయాలి. అలాగే, ఏమైనా సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు ఒక క్యూఆర్ కోడ్‌ను రూపొందించాలి.
దీన్ని స్కాన్ చేయడం ద్వారా వినియోగదారులు ఫిర్యాదు చేసేందుకు వీలు కల్పించాలి. అలాగే, ఆ రికార్డుల్ని భద్రపరచాలి. సెంట్రల్ బోర్డ్ లైసెన్స్ కలిగిన హోటళ్లు, 10కంటే ఎక్కువ హోటళ్లు నిర్వహించే సంస్థలు తప్పనిసరిగా మెనూ కార్డ్ పాటించాలి. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ ఫుడ్ గురించి ప్రత్యేకంగా వివరించాలి. ఈ మెనూలో వంట నూనె వివరాలతోపాటు ఫుడ్ కలర్స్, స్వీటెనర్స్, అలర్జీ కలిగించే పదార్థాల గురించి కూడా ఉండాలి. నిషేధిత రంగుల్ని, హానికర పదార్థాల్ని వంటలో వాడరాదు. ఆహార పదార్థాల్లో రసాయనాలు, లిక్విడ్ నైట్రోజన్ కూడా నిషేధమే. ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్, ఫుడ్ సేఫ్టీ కనెక్ట్ క్యూఆర్ కోడ్‌ను మెనూలో పొందురచాలి.
రిఫ్రిజరేటర్లు, డీప్ ఫ్రీజర్లలో తగినంత టెంపరేచర్ మెయిన్టైన్ చేయాలి. ఏ పదార్థాన్ని ఎప్పుడు తయారు చేశారు.. ఎప్పుడు ఫ్రీజర్లలో ఉంచారు వంటి విషయాలపై రికార్డు మెయిన్టైన్ చేయాలి. కిచెన్లలో తగిన వెంటిలేషన్, లైటింగ్ ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి అనేక నిబంధనల్ని హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, క్లౌడ్ కిచెన్స్ వంటివన్నీ కచ్చితంగా పాటించాల్సిందే అని యూపీ ప్రభుత్వం ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TB | టీబీ వ్యాధికి ఇక ఒకే ఒక్క ఇంజెక్షన్ చాలు.. సన్నాహాలు చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ..
KTR | ఎత్తిపోతల పథకం టెండర్లలోనూ మంత్రి పొంగులేటి కంపెనీకి అనుచిత లబ్ధి : కేటీఆర్
ఉపాధి కోసం ఆంధ్రా వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి
Student | అమీర్‌పేటలో హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థి ఆత్మహత్య..!
మోటకొండూర్‌లో రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

