Bhagya Shree Borse | మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది భాగ్య శ్రీ బోర్సే.. ఆ తర్వాత కింగ్ డమ్, ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాల్లో నటించగా.. ఈ మూవీస్ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయాయి. చివరగా అఖిల్ అక్కినేనితో కలిసి నటించిన లెనిన్ ఈ బ్యూటీకి మంచి విజయాన్ని అందించింది. సంప్రదాయ దుస్తుల్లో, ట్రెండీ కాస్ట్యూమ్స్‌లో అయినా కెమెరాకు ఫోజులిచ్చిందంటే ఈ భామ లుక్స్ కు ఫిదా అవ్వాల్సిందే.
భాగ్య శ్రీ బోర్సే తాజా స్టైలిష్ క్యాజువల్ లుక్కు సంబంధించిన ఫొటోలను నెట్టింట పోస్ట్ చేసింది. బ్లూ డెనిమ్, మినీ స్కర్ట్‌లో ట్రెండీ టచ్ ఇస్తూ కెమెరాకు ఫోజులిచ్చింది. హెరిటేజ్ బిల్డింగ్, తాటి చెట్ల ముందు కూర్చొని దిగిన స్టిల్స్ కుర్రకారుకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.