రాజాపేట, మార్చి 25 : యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని పాముకుంటలో బడిబాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఎంఈఓ రమేశ్, ప్రధానోపాధ్యాయులు ధనలక్ష్మి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బడి ఈడు పిల్లలు, ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులను గుర్తించారు. తల్లిదండ్రులతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత వసతులను వివరించారు.
పాఠ్య పుస్తకాలు, వర్క్‌బుక్స్, యూనిఫామ్స్, మధ్యాహ్న భోజనంతో పాటు రాగి జావా అందిస్తున్న వివరాలను విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ఒక్క పైసా ఖర్చు లేకుండా నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు. బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఈ సందర్భంగా వారు కోరారు.