భువనగిరి కలెక్టరేట్: బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామమైన బీఎన్ తిమ్మాపురం గ్రామంలో సహాయ పునరావాస చర్యలను వేగవంతం చేయాలని కలెక్టర్ పమేలాసత్పతి ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బీఎన్ తిమ్మాపురం గ్రామస్థులు, అధికారులతో కలెక్టర్ సమావేశమై భూసేకరణ, పరిహారం చెల్లింపుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముంపు గ్రామం ఉన్నందున స్వయంగా సందర్శించి పరిస్థితులను అవగాహన చేసుకుని, సహాయ చర్యలు తీసుకుంటామన్నారు.
గ్రామంలో 37మంది రైతులు మరణించారని అట్టి రైతుల కు రైతు భీమా, రైతుబంధు కోల్పోతున్నారని కలెక్టర్ దృష్టికి గ్రామస్థులు తీసుకు వెళ్లగా సానుకూలంగా స్పందించిన కలెక్టర్ సమగ్ర చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత కొత్తగా నిర్మించుకు న్న 72ఇండ్లకు కూడా పునరావాస ప్యాకేజీ అమలు చేయాలని, అదేవిధంగా త్రాగునీరు, విధ్యుత్, డ్రైనేజీ తదతర కనీస అవసరాలు పునరుద్ధ రించాలని సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.
గ్రామంలో ఉన్న 1760ఎకరాల భూమికి నోటిఫికేషన్ జారీ చేసి 473 ఎకరాలు సేకరించినందున రూ, 15లక్షల 60వేల చొప్పున పరిహారం మిగిలిన ఎకరాలకు కూడా చెల్లించాలని, ఒకేసారి నోటిపికేషన్ జారీ చేసినందున అన్నింటికీ రూ.15 లక్షల 60వేల చొప్పున చెల్లించాలని గ్రా మస్థులు కోరారు. గ్రామంలో ఉన్న 104ఎ కరాల భూమికి వారసులు గ్రామంలో లేని కారణంగా కబ్జాలో ఉన్న వారికి పట్టాలు జారీ చేసి భూ సేకరణ జరిపి పరిహారం చెల్లించాలని రైతులు కోరారు.
సహాయ పునరావాస చర్యల కింద వెంటనే అభివృద్ధి చేపట్టి లే అవుట్ రూపొందించాలని, ఫ్లాట్లు చేసి శంఖుస్థాపన చేసి పునరావాస ప్యాకేజీ వెంటనే అమలు చేయాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు దీపక్‌తివారీ, భూపాల్‌రెడ్డి, ఆర్డీవో సూరజ్‌కుమార్, తహసీల్దార్ శ్యాంసుందర్‌రెడ్డి ఇరిగేషన్ ఇంజినీర్లు, భూసేకరణ అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.