బీబీనగర్, జనవరి 31 : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో గ్రామ పాలన అధికారిగా విధులు నిర్వహిస్తున్న షేక్ అబ్బాస్‌తో పాటు కార్యాలయ సిబ్బందిపై అక్రమంగా దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిపిఓ ల సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కుక్కల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇటువంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా పునరావృతం కాకుండా గ్రామ పాలన అధికారులకు తగిన రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
అనంతరం బీబీనగర్ తాసీల్దార్‌కు వినతి పత్రం అందజేసి దోషులకు కఠిన శిక్షలు విధించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు, అధికారుల మధ్య ఐక్యత మరింత బలపడాల్సిన అవసరం ఉందని నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గజం సత్తయ్య, ప్రధాన కార్యదర్శి చక్రపాణి, మండల అసోసియేట్ అభ్యర్థి నరసింహ, ఉపాధ్యక్షులు మౌనిక, శ్రీలత, రాజమణి, సుమిత్ర తో పాటు జిల్లా నాయకులు రమేష్, సుజాత, బాలమణి పాల్గొన్నారు.