ఆలేరు టౌన్, జూలై 25 : కాలనీ సమస్యలను వార్డు సభ్యులు వార్డు ఆఫీసర్ దృష్టికి తీసుకువస్తే వాటిని సత్వరమే పరిష్కరిస్తారని ఆలేరు మున్సిపల్ కమిషనర్ బి.శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం ఆలేరు పట్టణంలోని 7వ వార్డు కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి వార్డు ఆఫీసర్ గౌడ సుకన్యను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ప్రజల సౌకర్యార్థం ఆలేరు పట్టణంలోని ప్రతి వార్డుకు కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం ప్రజలకు పరిపాలనను చేరువ చేయడం కోసమే వార్డుల్లో కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎం ఏ.ఎజాస్, చింతకింది రేణుక వేణుగోపాల్, బీజాని భాస్కర్, కాసుల భాస్కర్, కల్వకుంట్ల లోకేశ్, మెరుగు శ్రీధర్, సంపత్, సాగర్, పాండు, రాజశేఖర్, పూర్ణచందర్, వార్డ్ ఆఫీసర్స్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.