భూదాన్ పోచంపల్లి, అక్టోబర్ 09 : భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని గౌస్ కొండ గ్రామంలో శ్రీ శివరామ దుర్గా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన లక్కీ డ్రా గురువారం నిర్వహించారు. చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన రూపాని రాజు లక్కీ డ్రా విజేతగా నిలిచాడు. దీంతో చిట్యాల మండలంలోని చినకాపర్తి గ్రామంలో గల 150 గజాల ప్లాటును రాజు పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. ఈ సందర్భంగా రాజు శ్రీ శివరామ దుర్గా కమిటీ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కూపన్ అమౌంట్‌గా రూ.299 చెల్లించి ప్లాట్ గెలుపొందడంపై రాజుకు అందరూ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు గూడూరు ప్రమోద్ రెడ్డి, వెదిరే రాజిరెడ్డి, మర్రి నితిన్ రెడ్డి, కళ్లెం రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.