Pailla Shekar Reddy : మున్సిపల్ ఎన్నికలవేళ భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ముక్తాపూర్లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ముక్తాపూర్, ఫస్ట్ వార్డులో కాంగ్రెస్ పార్టీని వీడిన 30 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ స్థానిక కీలక నేత సన్న నరసింహ యాదవ్, తన 30 మంది అనుచరులతో కలిసి కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరారు.
సన్న నరసింహ యాదవ్, 30 మంది అనుచరులకు పైళ్ల శేఖర్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పైళ్ల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన చేపడుతుందని, ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. భువనగిరి మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
పైళ్ల శేఖర్ రెడ్డి వెంట మాజీ ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి , మాజీ వైస్ ఎంపీపీ పాక వెంకటేష్ యాదవ్, మాజీ జెడ్పిసి కోట పుష్పలత మల్లారెడ్డి, పిఎసిఎస్ మాజీ చైర్మన్ కందాల భూపాల్ రెడ్డి, నాయకులు కొంగరి కృష్ణ , గుండు మధు, మునుకుంట బాలచందర్, నోముల మాధవరెడ్డి, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.