రాజాపేట, జూన్ 14 : ఎ్రరబెల్లి వ్యవసాయ క్ష్రేతంలో ప్రమాదవశాత్తు జారిపడడంతో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలికి గాయాలయ్యాయి. హైదరాబాద్లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పల్లా త్వరగా కోలుకోవాలని శనివారం జనగామ జిల్లా చేర్యాల మండలానికి చెందిన భూమిగాని రాజేందర్, చేర్యాల నుంచి యాద్రాది లక్షీనరసింహస్వామి ఆలయం వరకు పాదయ్రాత చేపట్టారు. పాదయాత్ర రాజాపేట మండలానికి చేరుకున్న సందర్భంగా నెమిల క్రాస్ రోడ్డు వద్ద బీఆర్ఎస్వీ ఆలేరు నియోజకవర్గ నాయకుడు మోత్కుపల్లి బాలకృష్ణ ఘనంగా స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వరిమడ్ల బాలకృష్ణ, శ్రీకాంత్, భాస్కర్ పాల్గొన్నారు.