బీబీనగర్, ఏప్రిల్ 17 : ఉపాధి కూలీలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామ సర్పంచ్ సిద్దగోని శ్రీకాంత్ గౌడ్ సూచించారు. బీబీనగర్ మండలంలోని రాఘవాపురం గ్రామ పరిధిలో ఉపాధి హామీ పథకం పనుల్లో పాల్గొన్న మహిళా కూలీలకు ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఓఆర్ఎస్ ప్యాకెట్లను శుక్రవారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఉపాధి కూలీలు తప్పనిసరిగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎండలో పని చేసే సమయంలో తరచూ నీరు తాగడం, తలపై గుడ్డ లేదా టోపీ ధరించడం, మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోవడం, అవసరమైనప్పుడు ఓఆర్ఎస్ ద్రావణం తీసుకోవడం ద్వారా నీరసం, అలసట వంటి సమస్యలను నివారించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాణి, ఏపీఓ కళావతి, టీఏ రమేశ్ పాల్గొన్నారు.