రాజాపేట, మే 08 : పహాల్గాం ఘటనకు ప్రతికార చర్యే ఆపరేషన్ సింధూర్ అని బీఆర్ఎస్ రాజాపేట మండలాధ్యక్షుడు సట్టు తిరుమలేశ్ అన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో ఆపరేషన్ సిందూర్‌కు సంఘీభావంగా బీఆర్ఎస్ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదం అంతమొందించేందుకు ఉక్కుపాదం మోపాలన్నారు. జై భారత్ జై జవాన్, పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోపగాని బాలమణి యాదగిరిగౌడ్, చింతలపూడి వెంకటరామిరెడ్డి. చింతలపురి భాస్కర్ రెడ్డి, ఎర్రగోకుల జస్వంత్, భోగ హరినాథ్, సంధిలా భాస్కర్ గౌడ్, బెడిదే వీరేశం, యమ్మ భాస్కర్, సందెల వెంకటేశం, మోత్కుపల్లి బాలకృష్ణ, గంధ మల్ల సురేశ్, వరిమడ్ల సురేశ్ పాల్గొన్నారు.