ఆలేరు టౌన్, ఆగస్టు 7: గొర్రెల మందపై కుక్కలు దాడి చేయడంతో వంద గొర్రెలు మృతి చెందాయి. ఈ విషాదకర సంఘటన ఆలేరు పట్టణంలో చోటు చేసుకుంది. ఆలేరు పట్టణం బహదూర్ పేటకు చెందిన ఎగ్గిడి సంపత్ గొర్రెలను పెంచుతూ జీవిస్తున్నాడు. అయితే, బుధవారం రాత్రి సమయంలో తాము పెంచుతున్న గొర్ల దొడ్డిపై కుక్కల మంద ఆకస్మికంగా దాడి చేయడంతో సుమారు 100 గొర్రెలు మృతి చెందాయి. ఈ సంఘటన వల్ల ఆ కుటుంబం ఆర్థికంగా తీవ్రంగా నష్టం పోయింది. ప్రభుత్వం స్పందించి తగిన పరిహారం కల్పించాలని గ్రామస్తులు కోరారు.
ఇవి కూడా చదవండి..
Cluster Beans | గోరు చిక్కుడు కాయలను తరచూ తింటే ఎన్ని లాభాలు కలుగుతాయో తెలుసా..?
KA Paul | విజయ్ దేవరకొండపై కేఏ పాల్ ఫైర్.. డబ్బిచ్చి క్షమాపణలు చెప్పు