ICC Player Of Month | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు భారత యువ టెస్ట్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నామినేట్ అయ్యాడు. ఈ అవార్డు కోసం ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, దక్షిణాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్ వియాన్ ముల్డర్‌తో పోటీలో ఉన్నాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన టెస్ట్ సిరీస్‌లో ముందుండి జట్టును నడిపించాడు. ఈ క్రమంలో బ్యాటింగ్‌లో పలు రికార్డులను నమోదు చేశాడు. గిల్ సారథ్యంలోని యువ భారత జట్టు సిరీస్‌ను 2-2తో డ్రా చేసింది. సిరీస్‌లో గిల్ 74.50 సగటుతో నాలుగు సెంచరీ సహాయంతో 754 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ సైతం ఉన్నది.
ఈ క్రమంలో యువ కెప్టెన్ ఒకే సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ (732 పరుగులు) రికార్డును బద్దలు కొట్టాడు. సర్ డొనాల్డ్ బ్రాడ్ మ్యాన్ (810) పరుగులతో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు ఆల్ టైమ్ కెప్లెన్ల జాబితాలో గిల్ రెండోస్థానంలో ఉన్నాడు. ఈ సందర్భంగా ఐసీసీ గిల్‌ను ప్రశంసించింది. జులై మాసంలో బాగా రాణించాడని.. మూడు టెస్టు మ్యాచుల్లో 94.50సగటుతో 567 పరుగులు చేశాడని పేర్కొంది. ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ సాధించిన రికార్డు విజయంలో గిల్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 269 పరుగులు చేసిన గిల్.. రెండో ఇన్నింగ్స్‌లో 161 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 430 పరుగులు చేశాడు. ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గ్రహం గూచ్ (456) నిలువగా.. ఆ తర్వాతి స్థానంలో శుభ్‌మన్ గిల్ రెండోస్థానంలో ఉన్నాడు.
ఇక దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా తన తొలి మ్యాచ్‌లో ముల్డర్ బింజాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో అజేయంగా 367 పరుగులు చేశాడు. 2004లో ఇంగ్లండ్‌పై గ్రేట్ బ్రియాన్ లారా చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోర్ 400 నాటౌట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ రికార్డును బద్దలు కొట్టగలిగే సమయంలో జట్టు ఇన్నింగ్స్‌ను ముల్డర్ డిక్లేర్ చేశాడు. రెండు మ్యాచుల్లో 265.50 సగటుతో 531 పరుగులు చేశాడు. ముల్డర్ బౌలింగ్‌లోనూ తన వంతు పాత్ర పోషించాడు మొదటి టెస్ట్‌లో నాలుగు వికెట్లు సహా 15.28 సగటుతో ఏడు వికెట్లు పడగొట్టాడని ఐసీసీ పేర్కొంది. స్టోక్స్ ఆల్ రౌండ్ ప్రదర్శనను సైతం ఐసీసీ ప్రశంసించింది. భారత్‌తో జరిగిన మ్యాచుల్లో 50.20 సగటుతో 251 పరుగులు చేశాడు. 26.33 సగటుతో 12 వికెట్లు పడగొట్టాడు. ఒత్తిడి పరిస్థితుల్లో బ్యాట్, బంతి రెండింటితోనూ రాణించాడని ఐసీసీ ప్రశంసలతో ముంచెత్తింది.
A Protea and an English all-rounder lock horns with an in-form India batter for the July ICC Men’s Player of the Month honours 👊https://t.co/1YLjnbwf50
— ICC (@ICC) August 6, 2025