యాదగిరిగుట్ట, మే12 : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిర్రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. సోమవారం స్వామివారి కొండపైకి చేరుకున్న ఆయన స్వయంభూ పంచనారసింహస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.