– పద్మశాలి యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతకింది కిరణ్
– భూదాన్ పోచంపల్లిలో మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం
భూదాన్ పోచంపల్లి, నవంబర్ 26 : నల్లగొండ డీసీసీ అధ్యక్ష పదవి నుండి పున్న కైలాష్ నేతను తొలగించి ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాయడం పట్ల రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దిష్టిబొమ్మను తెలంగాణ ప్రాంత పద్మశాలి యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతకింది కిరణ్ ఆధ్వర్యంలో భూదాన్ పోచంపల్లిలో బుధవారం దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ.. తెలంగాణ పద్మశాలి, బీసీ ఉద్యమ నేత పున్న కైలాష్‌ను అకారణంగా దూషించడం పట్ల తీవ్రంగా ఖండించారు. గత మునుగోడు ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పద్మశాలీలందరూ పూర్తిగా సహకరించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. మంత్రి కోమటిరెడ్డి కుటుంబం, బంధువులకు మాత్రమే పదవులు రావాలా, బీసీలకు పదవులు వస్తే జీర్ణించుకోలేరా అని ఆయన ప్రశ్నించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యువజన నాయకులు సిద్దుల ప్రభాకర్, గుండు ప్రవీణ్, సురపల్లి కృష్ణ, గుర్రం లక్ష్మణ్, పగడాల శ్రీనివాస్ పాల్గొన్నారు.

Bhoodan Pochampally : ‘బీసీలకు పదవులిస్తే జీర్ణించుకోలేని మంత్రి కోమటిరెడ్డి’