బీబీనగర్, ఏప్రిల్ 01 : గ్రామంలోని తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా బీబీనగర్ గ్రామ పంచాయతీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గ్రామ సర్పంచ్ పంజాల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం నూతన బోరును ఏర్పాటు చేసి ప్రారంభించారు. వేసవి కాలం సమీపిస్తున్న నేపథ్యంలో గ్రామంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ తెలిపారు. గ్రామ ప్రజలకు ఎటువంటి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోలి నర్సింహ రెడ్డి, వార్డు సభ్యులు కాసుల వరలక్ష్మి మహేశ్ గౌడ్, పంజాల ప్రవీణ్ గౌడ్, పాశం కవితా మహిపాల్, కట్ట వినోద్, సోమ శివకుమార్, నెల్లుట్ల శ్రీశైలం, పిట్టల శ్యామల శ్రీనివాస్, బుర్రి సుదర్శన్, రొడ్డ శ్రీనివాస్, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.