The Indian Border | ఆదిత్య మీనన్, అజయ్, మురళీమోహన్, కిరణ్ యార్లగడ్డ, ఆదర్శ్ సింధు తులానీ, మేఘ శ్రీ లీడ్ రోల్స్‌లో నటిస్తోన్న చిత్రం ది ఇండియన్ బార్డర్ (The Indian Border). డీఎస్ బాషా డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఇండిపెండెన్స్ డే కానుకగా ‘జిందా రహేన్ తో డ్యూటీ’ అంటూ సాగే సాంగ్‌ను లాంచ్ చేశారు. డీఎస్ బాషా రాసిన ఈ పాటను ఆనంద్ మంత్ర కంపోజిషన్‌లో శర్వాణా పాడాడు.
సరిహద్దులో జవాన్ల త్యాగాలు, ధైర్య సాహసాలను గుర్తు చేసేలా.. నరనరాల్లో దేశ భక్తిని రగిల్చేలా సాగుతోంది. పాలస్తీనా వార్ టైంలో తనలో ఈ కథ పుట్టిందని సాంగ్ ఈవెంట్లో రైటర్ కమ్ హీరో కిరణ్ యార్లగడ్డ అన్నాడు. డీఎస్ భాషా కథకు ఓ రూపాన్ని తీసుకొచ్చారు. సైనికుడు, సైనికుడి భార్య చేసే త్యాగాలను ఈ సినిమాలో చూపించామన్నాడు.
ది ఇండియన్ బార్డర్ సైనికుడి త్యాగం, ఆలోచనలు, గొప్పదనం చెప్పేలా ఉంటుందని డైరెక్టర్ డీఎస్ బాషా అన్నారు. అందుకే ఈ సాంగ్‌ను కూడా సైనికుడికి అంకితం చేసేలా తీశాం. మనమంతా ఈ రోజు ఇక్కడ సంతోషంగా ఉన్నామంటే.. అందుకు కారణం సైనికుడు చేసే త్యాగమే. కిరణ్ చెప్పిన కథ నాకు చాలా బాగా నచ్చింది. ఇంత మంచి కథలో భాగమవ్వడం నాకు సంతోషంగా ఉందని డైరెక్టర్ డీఎస్ బాషా చెప్పుకొచ్చారు.
Zinda Rahein Toh Duty! 🇮🇳
A powerful salute to the courage and sacrifice of our #IndianArmy – Team The Indian Border #ZindaRaheinTohDuty Lyrical Video Song out now from #TheIndianBorder https://t.co/V4e7az6cPZ#ArtInHeartCreations #NivedyaReddy #KiranYarlagadda #Aadarsh… pic.twitter.com/11PjCjEd6o
— BA Raju’s Team (@baraju_SuperHit) August 15, 2026
Weekend OTT | ఇండిపెండెన్స్ డే స్పెషల్.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన చిత్రాలివే!
FBI Report | అమెరికాలో భారీగా తగ్గిన హత్యల రేటు.. గడిచిన 75 ఏళ్లలో అత్యంత కనిష్ఠం..!
Rosemary Oil | జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రోజ్మేరీ ఆయిల్..అధ్యయనంలో వెల్లడి..