మోత్కూరు, మార్చి 28 : గురుకుల పాఠశాలలో ప్రమాణాల మెరుగుకు చర్యలు చేపట్టనున్నట్లు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. శనివారం మోత్కూరు పట్టణంలోని ఎస్సీ బాలుర గురుకుల పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి పాఠశాల విద్యార్థుల వసతులను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం, శుద్ధమైన తాగునీరు వసతుల మెరుగుకు చర్యలు చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. అంతకు ముందు పట్టణంలోని పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. మండల తాసీల్దార్ జ్యోతి, ఎంపీడీఓ బాలాజీ, మున్సిపల్ కమిషనర్ సతీశ్ కలెక్టర్ వెంట ఉన్నారు.