చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ (Choutuppal) సమీపంలోని జైకేసారంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జైకేసారంలో ఉన్న సార్ లాబ్స్ కెమికల్ పరిశ్రమలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వత ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. చూస్తుండగానే భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్ని మంటలు ఆర్పివేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. అర్ధరాత్రి సమయంలో భారీ అగ్నిప్రమాదం జరగడంతో భయాందోళనలకు గురైన ప్రజలు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.