రాజాపేట, ఏప్రిల్ 15 : భవనం ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు నిచ్చెన పైనుంచి జారి పడడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం సింగారంలో మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన చెన్నూరి పాండరి (60) భవనంపై ఉన్న పాత సామగ్రి తీయడానికి కట్టెతో తయారు చేసిన నిచ్చెన వేసుకుని ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు జారిపడడంతో తీవ్రగాయాలయ్యాయి. చికిత్స కోసం గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. పాండరికి ముగ్గురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నాడు. ఎస్ఐ అనీల్‌కుమార్ కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.