ఆలేరు టౌన్, మార్చి 12 : ఆలేరు పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పుట్ట మల్లేశ్ గౌడ్ జన్మదినాన్ని బుధవారం స్థానిక పాఠశాల క్రీడా మైదానంలో సూర్యోదయ వాకర్ సొసైటీ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు కొలుపుల హరినాథ్, సిపిఎం నాయకుడు మంగ నరసింహులు, పిఎసిఎస్ డైరెక్టర్ కట్టే గొమ్ముల సాగర్ రెడ్డి, మోటకొండూరు వైస్ ఎంపీపీ మల్లేశం గౌడ్, ఎంబ నరసింహులు, పంతం కృష్ణ, జింకల రామకృష్ణ , రవి, సొల్లేటి ప్రకాశ్, బండి నాగయ్య, మల్లేశ్‌గౌడ్, సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.